రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా జెవి మనోహర్ రెడ్డి
సూర్య, నంద్యాల బ్యూరో:రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా టీడీపీ సీనియర్ నాయకుడు, సీనియర్ న్యాయవాది జెవి మనోహర్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మెన్తోపాటు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ మూర్తి చైర్ పర్సన్, జిల్లా రిటైర్డ్ న్యాయమూర్తి నేరెళ్ల శ్రీనివాసరావుతో పాటు జెవి మనోహర్ రెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*