బావిలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం
సూర్య కోరుట్ల : జగిత్యాల జిల్లా
కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చింతకుంట గ్రామ శివారు బావిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామ శివారు బావి ప్రక్కనున్న కల్వర్టు పై ఇద్దరు స్నేహితులు కూర్చుని మద్యం సేవిస్తూ అదుపు తప్పి ఇద్దరు పక్కనే ఉన్న బావిలో పడి మృతి చెందారు. బుధవారం ఉదయం వరకు ఇద్దరు యువకులు ఇంటికి రాకపోయేసరికి తనతో పని చేసే కార్మికులు ఇంకా రాలేదని వెతక సాగారు. ఈ క్రమంలో గ్రామ శివారులోని బావి వద్ద వారి ఆనవాళ్లు కనపడగా వాళ్ళు వెతుకున్న క్రమంలో బావిలో మృతులు గా నీటిపైన పైకి తేలారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలనాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన ఆనంద్, సంజయ్ అనే యువకులుగా గుర్తించారు. గత వారమే కథలాపూర్ మండలంలోని చింతకుంట గ్రామానికి మేస్త్రి పని చేసేందుకు యువకులు వచ్చినట్లు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కథలాపూర్
పోలీసులు తెలిపారు.