కొందుర్గులో ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం....
ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి…
కొందుర్గు మండల కేంద్రంలో నూతనంగా రఘునాథ్ గౌడ్ నిర్మించిన ఎస్ ఆర్ కన్వెన్షన్ మరియు బ్యాంకెట్ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగాఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. కొందుర్గు మండల కేంద్రంలో పట్టణ స్థాయికి తగ్గట్టుగా అధునాతన వసతులతో ఈ కన్వెన్షన్ హాల్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు.ఈ ప్రాంత ప్రజలు తమ కుటుంబ,సామాజిక శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హాల్ నిర్వాహకులకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామకృష్ణ కొందుర్గు సర్పంచ్ ప్రభాకర్, మహాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి, విశ్వనాధ్ పూర్ సర్పంచ్ శ్రీలత రాములు,మాజీ సర్పంచులు జనార్దన్ గౌడ్,గోపాల్ నాయక్,కొందుర్గు ఉపసర్పంచ్ చంద్రశేఖర్,ఉత్తరస్ పల్లి ఉపసర్పంచ్ అలీం భాయ్,నాయకులు వసూరి,విజయ్,నవీన్, నవాజ్ రెడ్డి,వెంకటేష్,అనంత రాములు, ,లింగం,లక్ష్మణ్,శ్రీకాంత్,నర్సిములు,గణేష్,తదితరులు పాల్గొన్నారు.
మేజర్ న్యూస్ కొందుర్గు….