BREAKING
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఈ మార్పులు తప్పనిసరి.. ప్రశాంతమైన వాతావరణం కోసం ఇవి చేయండి! మాగుంటకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు. ఎంఎల్ఎస్ పాయింట్లలో హమాలీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు • జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు రోజూ జ్యూస్ తాగుతున్నారా?.. పండ్లను జ్యూస్‌లా కాకుండా నేరుగా తినడం ఎందుకు మేలో తెలుసా! నంద్యాల పురపాలక సంఘం 29వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థిగా రుషి కేశవరెడ్డి ఎల్‌నినో నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి చేనేత వస్త్రాల కొనుగోలుతో నేతన్నలకు ప్రోత్సాహం సింగరేణి కార్మికులకు వరాల జల్లు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐఎన్‌టీయూసీ పాలాభిషేకం డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారంపై కసరత్తు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న కార్తీక్ ఆర్యన్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫ్రెడ్డీ మూవీ విశేషాలు ఏసీబీ సోదాల వేళ.. బాధితుల బాణాసంచా సంబరాలు! యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు.. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి వృద్ధాశ్రమంలో పోలీస్ కమిషనర్ సేవా కార్యక్రమం రాప్తాడు మండలంలో సర్పంచి స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం

Select Suryaa Now
ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ ;ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంతో పాటు, వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పలమనేరు ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ. నాగ శశిభూషణ్ రెడ్డి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మాంజలి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మమతా రాణి పాల్గొన్నారు.అలాగే పలమనేరు డివిజన్ పరిధిలోని పత్తికొండ, గంగవరం, పెద్దపంజాణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పలమనేరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు శిబిరంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించడంతో పాటు, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. వ్యాధులను తొలిదశలో గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న ఇటువంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.