ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టినా భయపడేది లేదు
ఎన్నికల సంఘం (ఈసీ) తీరుకు వ్యతిరేకంగా తమ పోరాటం ఎప్పటికీ ఆగదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాము ఎలాంటి దాడులకూ తలొగ్గేది లేదని, భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విద్యార్థులు అయినా, రాజకీయ నాయకులు అయినా ప్రభుత్వ అక్రమాలపై అందరి స్వరం ఒక్కటేనని అన్నారు. పోలీసులు తాము చేసే ప్రతీ పనినీ రికార్డ్ చేసుకోవచ్చని, తాము సేకరించిన ప్రతీ ఎవిడెన్స్ను ప్రజలందరికీ సమర్పిస్తామని తెలిపారు. విద్యార్థులపై పోలీసులు దాడి చేశారనడానికి పక్కా సాక్ష్యాలు ఉన్నాయని, తమపై ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టినా వెనకడుగు వేసేది లేదని రాహుల్ గాంధీ హెచ్చరించారు.