ఏపీలో మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంపై సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామాల విలీన ప్రక్రియపై సుప్రీంకోర్టు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మున్సిపాలిటీల్లో గ్రామాలను విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విలీన వ్యవహారానికి సంబంధించి తుది తీర్పు సుప్రీంకోర్టు ఆదేశాలకే లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకోకుండా, ఎలాంటి అధికారిక ఆమోదం లేకుండానే ఏకపక్షంగా విలీనం చేశారని, ఈ ప్రక్రియలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించలేదని పిటిషనర్లు తరఫు న్యాయవాదులు తమ వాదనల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.