తాగునీటి సౌకర్యానికి 12.50 ఎంపీ నిధులు.
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్
తాగునీటి సౌకర్యానికి రూ.12.50 లక్షల ఎంపీ నిధులు మంజూరు
పూడి కుప్పం గ్రామంలో తాగునీటి సౌకర్యానికి రూ.12.50 లక్షల ఎంపీ నిధులు మంజూరు అయ్యాయి. తడ మండలం ఇరకం పంచాయతీ పరిధిలోని కుప్పం ప్రజలకు పూడి పంచాయతీ పరిధిలోని పూడి కుప్పం గ్రామంలో 175 కుటుంబాలకు కొత్తగా ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీటి సౌకర్య కల్పనకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నిధులను మంజూరు చేశారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విజ్ఞప్తి మేరకు ఎంపీ ఈ నిధులను కేటాయించారు.
మంజూరైన నిధులతో గ్రామంలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు బోరు, మోటారు, పైప్లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బోరు వేయడంతో పాటు మోటారు ఏర్పాటు కూడా సిద్ధం చేసినట్లు స్థానికులు తెలిపారు. పైప్లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ గురుమూర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకుని ఎంపీ నిధులు మంజూరు చేసిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికి, ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు, తడ మండల పార్టీ కన్వీనర్ ఆర్ముగంకు పూడి కుప్పం గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి.