BREAKING
గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన బాల త్రిపుర సుందరీ దేవి నాలుగో రోజు దుర్గామాతకు పూజలు అద్దంకి విద్యుత్తు ఈఈ మస్తాన్ రావుకు SE గా పదోన్నతి రేణిగుంట ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఎమ్.పి.టీ.సి ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారు గడువు లోపు రైతులు ఈ కీవైసీ పూర్తి చేసుకోవాలి. శేషంపల్లిలో ఆరోగ్య రథం సేవలు.. ఈవీఎం గోదాముల భద్రతలో అలసత్వానికి తావు లేదు- నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సర్దుబాటుపై కుస్తీపట్లు హింసకు తావులేకుండా భక్తితో బన్నీ ఉత్సవాలు జరగాలి: ప్లాన్లో కృష్ణ లీలలు... కబ్జాకు విజయ మార్గం! పాల్మాకుల్‌లో మహిళ అనుమానాస్పద మృతి దేవరగట్టు ఉత్సవాలను భక్తి భావంతో నిర్వహించుకోండి: కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ .సిరి జనసేన ఇంటికి రాధా రామాయణంలో యశ్ లుక్‌పై ఆర్య బబ్బర్ సంచలన కామెంట్స్.. ఆదిపురుష్‌లో సైఫ్ నటన చాలా బాగుంది!

విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో నాణ్యమైన విద్య అభినందనీయం- మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్, నంద్యాల ఎంపి భైరెడ్డి శబరి

Select Suryaa Now
విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో నాణ్యమైన విద్య అభినందనీయం- మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్, నంద్యాల ఎంపి భైరెడ్డి శబరి

 సూర్యసద్యాలబ్యూరో;    నద్యాలలో విద్యార్ధులకు కార్పొరేట్ స్థాయి వసతులతో నాణ్యమైన విద్య అభినందనీయమని మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ లో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన రావూస్ నూతన ఐఐటి మరియు జెఈఈ నీటి క్యాంపస్ను మంత్రి ఫరూక్, నంద్యాల ఎంపి భైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ లు ప్రారంభించారు. కళాశాల ఛైర్మెన్ అప్పారావు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.

 మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లాభా పేక్ష లేకుండా పేద, మధ్య తరగతి విద్యార్థులకు రావూస్ విద్యాసంస్థల ఛైర్మెన్ అప్పారావు సేవ చేస్తున్నారన్నారు. గత 30 సంవత్సరాలుగా అప్పారావు నాకు సుపరిచితులు అన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ నంద్యాల మరియు పరిసర ప్రాంతాల విద్యార్థుల కోసం పట్టణ నడిబొడ్డున అత్యున్నత ప్రమాణాలతో నూతన భవనాన్ని నిర్మించడం ఎంతో హర్షనీయమన్నారు. నంద్యాల విద్యారంగానికి అప్పారావు ఒక ఆణిముత్యం లాంటి వారన్నారు. మా బంధువుల పిల్లలు ఇక్కడే చదువుకొని ఉన్నత స్ధాయికి చేరుకున్నారన్నారు. విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందిస్తున్న అప్పారావుని, డైరెక్టర్ మోని చంద్రని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు

. ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాలలో నాలుగు జూనియర్ కళాశాలలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ అప్పారావు అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. అప్పారావు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంలకు ఏమాత్రం తీసిసోని విధంగా విద్యార్థులకు మెరుగైన వసతులు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. విద్యార్థులు హైదరాబాద్, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మధ్య తరగతి కుటుంబాలకు అందుబాబు ధరల్లో జాతీయ స్థాయి అధ్యాపక బృందంతో ఐఐటి, జెఈఈ మరియు నీట్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శులు రామచంద్రరావు, ఎవిఆర్ ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, సెంట్రల్ ఫుడ్ కమిటీ మెంబర్ విశ్వనాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ రొడ్డా సుంకయ్య, అధ్యాపకులు సంగమేశ్వరయ్య, జగదీష్, నారాయణస్వామి, సుబ్రహ్మణ్యం తదితర అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*