121 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
ఇంకొల్లు, మేజర్న్యూస్;పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో పర్చూరు నియోజవకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన 121 మందికి 57 లక్షల 80 వేల 730/-
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నాయకులకు అందజేశారు. ప్రభుత్వ పరంగా అందరిని ఆదుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హామీ ఇచ్చారు. ఆయా మండలాల్లోని లబ్ధిదారులకు నాయకులు అందజేయాలని ఏలూరి ఆదేశించారు. కార్యక్రమంలో ఆరు మండలాల నాయకులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.