కరెంటు కోతలతో రోడ్డెక్కిన రైతన్న.
అద్దంకి–నార్కెట్పల్లి ప్రధాన రహదారిపై కొమ్మలపాడు వద్ద కొమ్మలపాడు, కుందుర్తి, మామిళ్ళపల్లి, మక్కెనవారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు రహదారి దిగ్బంధం చేపట్టారు. నిత్యం కరెంటు కోతలు విధించడం, వచ్చినా లో-వోల్టేజీ సమస్యలతో మోటార్లు కాలిపోవడం జరుగుతోందని రైతులు వాపోయారు. కష్టపడి సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో హైవేపై ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న సంతమాగులూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) పి. శేషగిరిరావు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడి ట్రాఫిక్ క్లియర్ చేశారు.