BREAKING
తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో గొర్రెల శ్రీధర్ కూకట్‌పల్లిలో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్ నాలుగో రోజు చండీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం దర్శి ప్రగతికి ఆధునిక రోడ్లే ఆధారం. ఎండపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇల్లు ఆపదలో ఉన్న ప్రాణానికి సీఎం సహాయనిధి సంజీవని. యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పిల్లలపై రష్మిక మందన్న ఫన్నీ కామెంట్స్.. నవ్వులు పూయించిన నేషనల్ క్రష్! అద్దంకి మండల ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్ల ప్రకటన విడుదల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా జెవి మనోహర్ రెడ్డి సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై నటి విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారంటూ ప్రశంసలు! బావిలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం జిల్లా కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ కొందుర్గులో ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్‌ ప్రారంభోత్సవం.... ఎంపీటీసీ రిజర్వేషన్ లు

మహా చండీ దేవిగా అమ్మవారి దర్శనం

Select Suryaa Now
మహా చండీ దేవిగా అమ్మవారి దర్శనం

బాపట్ల,మేజర్ న్యూస్: 

శ్రీ లలితా త్రిపుర సుందరీ పీఠం ఆధ్వర్యంలో బాపట్లలోని కోన కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, పుష్పార్చనతో పాటు విశేష అన్నప్రసాద నివేదనలు సమర్పించారు. అనంతరం నిత్య సువాసినీ పూజలో భాగంగా నలుగురు సువాసినులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి తీర్థప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం నిర్వహించిన భక్తి సంకీర్తన భక్తులను ఆకట్టుకుంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విశేష అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.