పట్టభద్రుల ఓటరు దరఖాస్తుల పరిశీలనపై శిక్షణ
పట్టభద్రుల ఓటరు దరఖాస్తుల పరిశీలనపై శిక్షణ
కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలనపై గ్రామ పంచాయతీ అధికారులు, టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం కందుకూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏఈఆర్వో జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షతన దరఖాస్తుల పరిశీలన, అర్హతలు, ధ్రువపత్రాల ధృవీకరణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.
పట్టభద్రుల ఓటరు నమోదుకు అర్హతలు : -
2023 అక్టోబర్ 31 నాటికి లేదా అంతకుముందే డిగ్రీ లేదా తత్సమాన అర్హత పొంది, సంబంధిత నియోజకవర్గ పరిధిలో నివసించే వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, ఇందుకోసం ఫారం-18ను అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత ఈఆర్వో/ఏఈఆర్వోకు సమర్పించాలన్నారు . గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు . దరఖాస్తులపై అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణకు 2026 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు గడువు ఉండగా, తుది ఓటరు జాబితా డిసెంబర్ 30న ప్రచురించనున్నారని తెలిపారుకార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, డీటీ (ఎన్నికలు) నరేష్ తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు.