BREAKING
ఓటీటీలో అదరగొడుతున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ థ్రిల్లర్.. అమెజాన్ ప్రైమ్‌లో ‘పరదా’ ట్రెండింగ్! రూ.5.71 కోట్లతో జుంటుపల్లి ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి.. 68 మందికి రూ.56.30 లక్షల చెక్కుల పంపిణీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న మలయాళం థ్రిల్లర్.. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో పార్వతి సినిమా! ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నాలుగు వందల కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. మూడు నెలల నిత్యావసర సరుకులు పంపిణీ! భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో కనకరాజు సూరి కుమార్తె రోహిణి! జనసేన అభ్యర్థిగా తెరపైకి పేరు.. అధిష్ఠానం పరిశీలనలో బయోడేటా? క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కుమార్తెకు అవకాశం దక్కుతుందా? బతుకమ్మ వేడుకల్లో అదరగొట్టిన నటి లయా.. చీరకట్టులో మెరిసిపోతున్న రీ-ఎంట్రీ భామ! ముదినేపల్లి ఎస్ఐగా టి సూర్య శ్రీనివాస్ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో నాణ్యమైన విద్య అభినందనీయం- మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్, నంద్యాల ఎంపి భైరెడ్డి శబరి సూర్య ఎఫెక్ట్:...... జల్ పల్లి పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు బిగ్‌బాస్ హౌస్‌లో తారాస్థాయికి నామినేషన్ల హీట్.. రోహిత్, త్రిగుణ్ మధ్య రణరంగం! ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి నెరవేరిన మాజీ సైనికుల దశాబ్దాల కల *మాజీ సైనికులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి జైలర్ 2 సినిమాలో నోరా ఫతేరి ప్రత్యేక గీతం.. తమన్నా రికార్డును బ్రేక్ చేస్తుందా?

మచిలీపట్నంలో వరుస ఇళ్ల దొంగతనాల కేసుల ఛేదన.. నిందితుడి అరెస్ట్‌, చోరీ సొత్తు స్వాధీనం

Select Suryaa Now
మచిలీపట్నంలో వరుస ఇళ్ల దొంగతనాల కేసుల ఛేదన.. నిందితుడి అరెస్ట్‌, చోరీ సొత్తు స్వాధీనం

మచిలీపట్నం, మేజర్ న్యూస్ : కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు మచిలీపట్నం పట్టణంలోని రాజుపేట ప్రాంతంలో జరిగిన వరుస ఇళ్ల దొంగతనాల కేసులను ఇనగుదురు పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి రాజుపేటకు చెందిన తిరుపతి ప్రవీణ్‌ (31)ను అక్టోబర్‌ 13న మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు 2022 నుంచి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, ఇనుప బీరువాలను ధ్వంసం చేసి నగదు, బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు వెల్లడైంది. దొంగిలించిన నగదుతో పాటు బంగారు ఆభరణాలను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బును ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌, జూదానికి వినియోగించినట్లు గుర్తించారు. అక్టోబర్‌ 13న మధ్యవర్తుల సమక్షంలో నిర్వహించిన నేర ఒప్పుదల, ఆస్తుల స్వాధీన ప్రక్రియలో వెండి కడ్డీలు రెండు, వెండి నాణేలు, బంగారు ఉంగరాలు, ఒక జత బంగారు చెవి దిద్దులు, లక్ష్మీదేవి రూపులు ఐదు, కరిగించిన బంగారం ముక్కతో పాటు చిన్నపిల్లల బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తు క్రైమ్‌ నంబర్లు 178/2026, 203/2025, 57/2025, 151/2024, 92/2024, 191/2023, 243/2022 కేసులకు సంబంధించినదిగా గుర్తించారు. క్రైమ్‌ నంబర్‌ 30/2026తో సహా మొత్తం ఎనిమిది కేసుల్లో నిందితుడి ప్రమేయంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో తలుపులు, కిటికీలు సక్రమంగా మూసి ఉన్నాయో తనిఖీ చేసుకోవాలని, ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తే విశ్వసనీయమైన పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఇనగుదురు పోలీసులు సూచించారు.

 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.