జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..
అమరావతి :వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులతో పాటు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కేసుల విచారణపై నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈడీ కేసులను ఇకపై రోజువారీ ప్రాతిపదికన విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా జగన్తో సహా మొత్తం 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించనుంది. గత పదేళ్లుగా సీబీఐ కోర్టులో 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్లోనే ఉన్నాయని, పలువురు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా తేలకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ అధికారులు ఇప్పటికే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, రోజువారీ విచారణ జరిపించాలని కోరిన సంగతి తెలిసిందే.