BREAKING
నెరవేరిన మాజీ సైనికుల దశాబ్దాల కల *మాజీ సైనికులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి జైలర్ 2 సినిమాలో నోరా ఫతేరి ప్రత్యేక గీతం.. తమన్నా రికార్డును బ్రేక్ చేస్తుందా? పొన్నూరులో టీవీఎస్ పీయోనీర్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ల తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో గొర్రెల శ్రీధర్ కూకట్‌పల్లిలో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్ నాలుగో రోజు చండీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం దర్శి ప్రగతికి ఆధునిక రోడ్లే ఆధారం. ఎండపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇల్లు ఆపదలో ఉన్న ప్రాణానికి సీఎం సహాయనిధి సంజీవని. యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పిల్లలపై రష్మిక మందన్న ఫన్నీ కామెంట్స్.. నవ్వులు పూయించిన నేషనల్ క్రష్! అద్దంకి మండల ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్ల ప్రకటన విడుదల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా జెవి మనోహర్ రెడ్డి సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై నటి విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారంటూ ప్రశంసలు! బావిలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం

గంగానదిలో ఘోర ప్రమాదం: పడవ బోల్తా పడి 13 మంది చిన్నారులు జలసమాధి.. రాఘోపూర్‌లో విషాదం!

Select Suryaa Now
గంగానదిలో ఘోర ప్రమాదం: పడవ బోల్తా పడి 13 మంది చిన్నారులు జలసమాధి.. రాఘోపూర్‌లో విషాదం!

సూర్య జాతీయ డెస్క్: బీహార్‌లోని పాట్నా సమీప రాఘోపూర్ వద్ద గంగానదిలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సుమారు 20 నుంచి 25 మంది చిన్నారులతో ప్రయాణిస్తున్న ఒక పడవ మంగళవారం రాత్రి నది మధ్యలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో దాదాపు 13 మంది చిన్నారులు నీటమునిగి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో పడవలో చిన్నారులే అధిక సంఖ్యలో ఉన్నారు. నది ప్రవాహ తీవ్రతకు తోడు ఒక్కసారిగా సమతుల్యత కోల్పోవడంతో పడవ పూర్తిగా తలకిందులైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, నావికులు రంగంలోకి దిగి పలువురు చిన్నారులను సురక్షితంగా రక్షించగలిగినప్పటికీ, అప్పటికే 13 మంది చిన్నారులు నదిలో మునిగిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే విపత్తు సహాయక బృందాలు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నది నుంచి చిన్నారుల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు కళ్లెదుటే ఆడుతూ పాడుతూ కనిపించిన పిల్లలు విగతజీవులుగా మారడంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పడవలో సామర్థ్యానికి మించి పిల్లలను ఎక్కించడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడమే ఈ భారీ ప్రాణనష్టానికి కారణమా అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ ప్రారంభించారు.