కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు యశోదమ్మకు ఘన నివాళి
పార్టీకి ఆమె చేసిన సేవలు మరువలేనివి.. పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించిన చైర్పర్సన్ అనిత, కిషోర్ నాయక్
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సంగిశెట్టి యశోదమ్మ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బానోత్ కిషోర్ నాయక్ యశోదమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మహిళా నాయకత్వానికి యశోదమ్మ అందించిన సేవలను ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేసుకున్నారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయిన కుమారి, సంగయ్య, బానోత్ దివ్య, పుల్చంద్, కాంగ్రెస్ నాయకులు ధరావత్ రామ్మూర్తి నాయక్, బోయిన సాయి, మహిళా కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని యశోదమ్మకు నివాళులర్పించారు.