BREAKING
జైలర్ 2 సినిమాలో నోరా ఫతేరి ప్రత్యేక గీతం.. తమన్నా రికార్డును బ్రేక్ చేస్తుందా? పొన్నూరులో టీవీఎస్ పీయోనీర్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ల తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో గొర్రెల శ్రీధర్ కూకట్‌పల్లిలో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్ నాలుగో రోజు చండీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం దర్శి ప్రగతికి ఆధునిక రోడ్లే ఆధారం. ఎండపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇల్లు ఆపదలో ఉన్న ప్రాణానికి సీఎం సహాయనిధి సంజీవని. యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పిల్లలపై రష్మిక మందన్న ఫన్నీ కామెంట్స్.. నవ్వులు పూయించిన నేషనల్ క్రష్! అద్దంకి మండల ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్ల ప్రకటన విడుదల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా జెవి మనోహర్ రెడ్డి సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై నటి విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారంటూ ప్రశంసలు! బావిలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం జిల్లా కలెక్టర్‌ ఓ. ఆనంద్‌

చట్టప్రకారమే ఎన్నికల ప్రక్రియ: మంత్రి నారాయణ

Select Suryaa Now
చట్టప్రకారమే ఎన్నికల ప్రక్రియ: మంత్రి నారాయణ

నెల్లూరు,  మేజర్ న్యూస్  :   మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న అర్థం పర్థం లేని ఆరోపణలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వార్డుల విభజన, రిజర్వేషన్లు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి చట్టప్రకారం, పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని కలెక్టర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బీసీ కోటాలో పోటీ చేయాలనుకున్నంత మాత్రాన రిజర్వేషన్లు మార్చలేదని, రోస్టర్ ప్రకారమే మేయర్ స్థానం ఓసీ జనరల్‌గా ఖరారైందని తెలిపారు. తన నియోజకవర్గంలోనూ పలు డివిజన్ల రిజర్వేషన్లు మారినా తాము జోక్యం చేసుకోలేదని, ఓటమి భయంతోనే వైసీపీ ఉనికి కోసం ఆరాటపడుతోందని ధ్వజమెత్తిన మంత్రి, కేవలం టీవీలలో లైవ్‌లు మరియు పేపర్లలో ఉండాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ నాయకులు నిరాధార విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంత వాతావరణంలో, పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిష్పక్షపాతంగా జరిగే ఈ ఎన్నికల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని మంచి చేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.