బుద్ధారంలో పోలీసుల ముమ్మర దాడులు-300 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం దగ్ధం-32 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు
గార్ల, మేజర్ న్యూస్, మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, బుద్దారం గ్రామ పంచాయతీలో గార్ల, బయ్యారం సీఐ రవీందర్, ఎస్సైలు సాయి కుమార్, ప్రశాంత్ లు తమ పోలీస్ లతో బుధవారం ఉదయం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. 300 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబా లను స్వాధీనం చేసుకోని ధ్వంస్యం చేశారు. సరైన కాగితాలు లేని 32 వాహనాలను గుర్తించి, పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్బంగా గార్ల-బయ్యారం సీఐ రవీందర్ మాట్లాడుతూ.. నాటు సారా తయారు చేయడం, ప్రజలకు విక్రయించడం చట్ట విరుద్ధమన్నారు. గుడుంబా తయారు చేసి, క్రయ విక్రయాలు చేస్తున్న వారి పై పోలీసులు పూర్తి స్థాయిలో "ఆరా.." తీస్తుందన్నారు. ఇక ముందు కఠినమైన చర్యలు తప్పవని సీఐ రవీందర్ హెచ్చరించారు. గంజాయితో పాటు ఇతర ప్రాణాంతకమైన వాటిని సరఫరా చేసినా.. ఎవ్వరికైనా విక్రయించిన కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి పేర్లు తమ పోలీసులకు తెలుపలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గొప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో గార్ల-బయ్యారం ఎస్సైలు, పోలీసులు, హోం గార్డ్స్ పాల్గొన్నారు.
రిపోర్టర్; నాగేశ్వరరావు, గార్ల, మహబూబాబాద్ జిల్లా