కమ్మ మహాజన సేవాసంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చెక్కుల పంపిణీ
కమ్మ మహాజన సేవా సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చెక్కుల పంపిణీ
మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్); పేద విద్యార్థులను ప్రోత్సహించి, వారి ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య సహకారంతో మణుగూరు కమ్మ మహాజన సేవా సంఘం ఆధ్వర్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులకు ఉపకార వేతన చెక్కులను పంపిణీ చేశారు.ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కాకూడదనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎంతో తోడ్పాటునందిస్తాయని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.సామాజిక సేవలో భాగంగా పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న తెలంగాణ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్యకు మరియు కమ్మ వారి సేవా సంఘాల అధ్యక్షులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కి మణుగూరు కమ్మ మహాజన సేవా సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కమ్మ మహాజన సేవా సంఘం అధ్యక్షులు ఉప్పలపాటి వెంకట రాంబాబు, ప్రధాన కార్యదర్శి తోటకూరి సతిష్ కుమార్, కోశాధికారి మానుకొండ ఉమాకర్, దండా రాధాకృష్ణ ,పుచ్చకాయల శంకర్, పొశం భాస్కర్, యలమాటి పూర్ణ, కరివేద వెంకటేశ్వర రావు, కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.