టిడిపిలో పలు కుటుంబాలు చేరిక
-పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రవికుమార్
ఆమదాలవలస, అక్టోబర్ 17, మేజర్ న్యూస్
ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పాలవలస పంచాయతీ చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన పలు కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై
చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన గురుగుబెల్లి గణేష్తో పాటు అదే గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, పేద కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విధానాలపై విశ్వాసంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల స్థానిక టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు