కలామ్ జీవితం ఆదర్శనీయం:
సూర్య, నిర్మల్ ప్రతినిధి :జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తా వద్ద డా. ఏపీజే అబ్దుల్ కలామ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ.. దేశానికి కలామ్ చేసిన నిస్వార్థ సేవలు చిరస్మరణీయమని, విద్యార్థులకు ఆయన జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. ఈద్గాం చౌరస్తా వద్ద కలామ్ కాంస్య విగ్రహంతో పాటు క్షిపణి నమూనాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన కలామ్, అణు శక్తి రంగంలో భారత్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు, యువకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.