BREAKING
పశ్చిమాసియాలో దెబ్బతిన్న ఇంధన సదుపాయాలు కలల్ని కనండి.. వాటిని సాకారం చేసుకోండి •యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం •జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అమెరికా సెనేట్ ఎన్నికల ఫలితాల అంగీకారంపై అభ్యర్థుల దాటవేత పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి ప్రపంచ మార్కెట్లలో కృత్రిమ మేధ సెల్లింగ్ ఒత్తిడి ఉన్నప్పటికీ లాభాల్లో కెనడా టీఎస్‌ఎక్స్ ఫ్యూచర్స్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంఘీభావం నీటిని కాపాడుకుందాం పర్యావరణాన్ని రక్షిద్దాం : బొక్క నరసింహారెడ్డి కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఎసిబి దాడులు ఉట్స్సారంగపల్లిరైతు వేదిక లో ఘనంగా బతుకమ్మ సంబరాలు... అర్మేనియాలో ఆస్తులు, రష్యాతో వాణిజ్య చరిత్రపై పెరుగుతున్న ఆందోళనలు ఆకాశాన్నంటుతున్న ఇంధన రవాణా వ్యయం హారర్ జానర్‌తో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సహస్ర కుంకుమార్చన పూజలు వికాస్‌ జ్ఞాపకార్థం రక్తదానం... మిత్రబృందం మానవీయ సేవలు • నగర మేయర్‌ అభినందనలు రాబోయే పండుగల సీజన్‌లో పెరగనున్న ఆటబొమ్మల ధరలు

డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

Select Suryaa Now
డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

​కావలి, మేజర్ న్యూస్ :   కావలి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, సమాజ సేవకులు దివంగత డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి సేవలను కావలి ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని స్థానిక శాసనసభ్యులుకావ్య కృష్ణారెడ్డి కొనియాడారు.​గురువారం కావలిలోని ఆర్ &బి. అతిథి గృహంలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ప్రభాకర్ నాయుడు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
​
​పద్మశ్రీ పురస్కారానికి కృషి: వైద్యరంగంలో, సామాజిక సేవా రంగంలో డాక్టర్ ప్రభాకర్ నాయుడు అందించిన విశేష సేవలకు గానూ ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డు దక్కాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. దీనికోసం అవసరమైతే నాయకులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

​వైద్య రంగానికి ఆయన పేరే గుర్తుగా : భవిష్యత్తులో కావలికి మెడికల్ రంగానికి సంబంధించి ఏ ప్రాజెక్ట్ లేదా అభివృద్ధి కార్యక్రమం వచ్చినా, దానికి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి పేరునే నామకరణం చేస్తామని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

​కావలిలో విగ్రహావిష్కరణ & సంతాప సభలు :  ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం సంతాప సభను నిర్వహిస్తామని, కావలి పట్టణంలో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్యాధికారులు, పట్టణ ప్రముఖులు మరియు ప్రభాకర్ నాయుడు గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.