BREAKING
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. బ్రిటన్ ప్రముఖ హాస్య నటుడు రస్సెల్ బ్రాండ్ లైంగిక దాడి కేసు ఈ నెల 30న ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ డా. ఏ పి జె అబ్దుల్ కలామ్ జీవితం ఆదర్శనీయం. : మహాలక్షి దేవి అలంకారంలో చాముండేశ్వరి దేవి ఢిల్లీలోని జంతర్మంతర్ నిరసన జాబితా నుండి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించాం. నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి. వ్యవసాయ రంగ అభివృద్ధిలో మహిళా రైతుల పాత్ర కీలకం: డీఏవో చంద్రకళ నేడు వైద్య ధృవీకరణకు చివరి అవకాశం -ఉదయం 9 గంటలకు రుయా ఆసుపత్రికి హాజరుకావాలి : డీఈఓ బ్రిటన్‌కు తిరిగి వచ్చిన తర్వాత ప్రిన్స్ హ్యారీ, మేఘన్ తొలి సంయుక్త బహిరంగ హాజరు వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు పెంపునకు.... రాజకీయ పార్టీలు సహకరించాలి----జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మెట్టు సంజయ్ కుమార్ యాదవ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి -న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక గుడుపల్లిలో రేపు టీడీపీ సర్వసభ్య సమావేశం తాడిపత్రికి పోలీస్‌ కవచం ఎన్నికల వేళ పట్టణ సరిహద్దుల్లో ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు అక్రమ నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా.. 24 గంటల పాటు వాహనాల తనిఖీలు డబ్బా గ్రామ సమీపంలో కారు-బైక్ ఢీ - మహిళకు తీవ్ర గాయాలు

గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి

Select Suryaa Now
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం డివిజన్ సబ్‌ కలెక్టర్ శుభం నోఖ్వాల్ గురువారం మధ్యాహ్నం సబ్‌ కలెక్టర్ కార్యాలయంలో 2027 గోదావరి పుష్కరాల సన్నాహకాలపై సమావేశం నిర్వహించారు. పుష్కరాల ప్రత్యేక ఉప కలెక్టర్ (ఎస్‌డీసీ) మహేష్‌తో పాటు రాజమహేంద్రవరం అర్బన్, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కడియం, సీతానగరం, కోరుకొండ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పుష్కరాల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులు, ప్రతిపాదిత అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై సబ్‌ కలెక్టర్ శుభం నోక్వాల్ అంశాల వారిగా అధికారులతో చర్చించారు. మండలాల పరిధిలోని పుష్కర ఘాట్లు, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, గుర్తించిన సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. శుభం నోక్వాల్ మాట్లాడుతూ, గత పుష్కరాల సమయంలో యాత్రికుల రాక, 2027 పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్యపై అంచనాలు, వారికి అవసరమైన సౌకర్యాల కల్పనపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. ఘాట్ల వద్ద స్నాన సదుపాయాలు, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రవాణా, భద్రత వంటి అంశాల్లో అవసరమైన పనులను గుర్తించి, మండలాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించి పుష్కరాల ఏర్పాట్లకు సన్నద్ధం కావాలని కార్యాచరణ అంశాలను చర్చించినట్లు తెలిపారు.