BREAKING
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ విస్తృత ప్రచారం భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించి, భూ హద్దులను ఖచ్చితంగా నిర్ధారించాలి భద్రాది జిల్లా కలెక్టర్ అంకిత్ కన్నాపూర్ లో మద్యం విక్రయాలు బంద్ - విక్రయిస్తే రూ.50 వేల జరిమానా న్నికల ప్రక్రియలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి పాదుకలు, పళ్లెములు అమ్మవారికి సమర్పణ అభివృద్ధిని చూసి కూటమి అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించండి. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోండి. ఎంపీ గురుమూర్తి అచ్చంపేట పట్టణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. గారకుర్తిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం! చండీదేవిగా కామాక్షి అమ్మవారు యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు -న్యూరో సర్జన్  డాక్టర్ కృష్ణ తేజ్  రెడ్డి సుధారాణి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం …పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీలు. కార్మిక బోర్డు లో జరిగిన అవినీతి పై విచారణ చేపట్టాలి అసలు ఎవరు ఈ గరివిడి లక్ష్మి.. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న సినిమా విశేషాలు

వ్యవసాయ రంగ అభివృద్ధిలో మహిళా రైతుల పాత్ర కీలకం: డీఏవో చంద్రకళ

Select Suryaa Now
వ్యవసాయ రంగ అభివృద్ధిలో మహిళా రైతుల పాత్ర కీలకం: డీఏవో చంద్రకళ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వ్యవసాయ రంగ అభివృద్ధిలో మహిళా రైతుల పాత్ర కీలకమని జిల్లా వ్యవసాయ అధికారిణి కె. చంద్రకళ అన్నారు. అంతర్జాతీయ మహిళా రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న ఉత్తమ మహిళా రైతులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ.. విత్తనాల ఎంపిక, పంటల సాగు, ఎరువుల వినియోగం, సస్యరక్షణ తదితర వ్యవసాయ పనుల్లో మహిళా రైతులు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయ రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. మహిళా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు.అనంతరం వ్యవసాయ రంగంలో విశేష సేవలందిస్తున్న సరసం లక్ష్మి, వంగేటి సమత, బాలమణితో పాటు పలువురు మహిళా రైతులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏఓ, అగ్రికల్చర్ టెక్నికల్ ఆఫీసర్ శిరీష, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.

రిపోర్టర్: పన్నాల బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.