BREAKING
48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్ మండపేట మున్సిపల్ ఎన్నికల్లో తొలిరోజు నామినేషన్లు నిల్ ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం

యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు -న్యూరో సర్జన్  డాక్టర్ కృష్ణ తేజ్  రెడ్డి

Select Suryaa Now
యశోద ఆస్పత్రిలో అధునాతన రోబోటిక్ ఎండోస్కోపీ ద్వారా న్యూరో చికిత్సలు -న్యూరో సర్జన్  డాక్టర్ కృష్ణ తేజ్  రెడ్డి
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి :  తెలంగాణ రాష్ట్రంలో యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో  మెదడు, వెన్నెముక సమస్యలకు అత్యాధునిక చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని యశోద సెంటర్ ఫర్ న్యూరోఎండోస్కోపీ అండ్​ రోబోటిక్ న్యూరోసర్జరీ వైద్యులు డా. కృష్ణ తేజ్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి యశోద హాస్పిటల్స్ బ్రాంచిలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్​లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​లో న్యూరోఎండోస్కోపీ, రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీ, అధునాతన ఇమేజింగ్ ద్వారా ఇన్వాసివ్ విధానంలో చికిత్సలు అందిస్తున్నామని కృష్ణ తేజ్ రెడ్డి వివరించారు. మెదడు కణితులకు ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ సహాయంతో శస్త్రచికిత్స సమయంలోనే కణితి తొలగించే విషయాన్ని అంచనా వేసి కీలక మెదడు భాగాలకు హాని కలగకుండా సురక్షితంగా తొలగిస్తున్నామని తెలిపారు. మందులకు లొంగని మూర్ఛవ్యాధికి రోబోటిక్ సహాయంతో సహా పలు శస్త్రచికిత్స ఎంపికలు తమ వద్ద ఉన్నాయన్నారు. 
తీవ్రమైన ముఖ నొప్పి అయిన ట్రైజెమినల్ న్యూరల్జియాకు ఎండోస్కోపిక్ మైక్రోవాస్కులర్ డికంప్రెషన్ ద్వారా దీర్ఘకాలిక ఉపశమనం కల్పిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు 110 కేసులను విజయవంతంగా చేశామని వెల్లడించారు. ప్రజల్లో అవగాహన కోసం అక్టోబర్ 7న ప్రపంచ ట్రైజెమినల్ న్యూరల్జియా దినోత్సవం రోజున ప్రత్యేక క్లినిక్​ను ప్రారంభించామని చెప్పారు. కామారెడ్డి, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఈ అధునాతన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కామారెడ్డి బ్రాంచ్ ఇన్​ఛార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.