జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆమనగల్లు, రంగారెడ్డి:
పట్టణ కేంద్రంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నారం అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, కోర్టు సిబ్బంది పాల్గొని రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను ఉంచి భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆమనగల్లు జూనియర్ కోర్టులో వివిధ విభాగాలలో విధులు నిర్వహించి. జిల్లాలోని వివిధ కోర్టులకు బదిలీపై వెళ్తున్న సీనియర్ అసిస్టెంట్ కైలాస్ ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ రమేష్ ల ను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అండేకర్ యాదిలాల్ ఆధ్వర్యంలో న్యాయవాదులతో కలిసి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్తీక్, కోర్టు సూపరిండెంట్ మురళీధర్, కోర్టు సిబ్బంది శివ,మల్లేష్, అర్జున్, వినయ్, విజయ్, ప్రభాకర్, వెంకటేష్, రవి కిరణ్, రవి, విల్సన్, కుమార్, షరీఫ్, సుజాత, సీనియర్ న్యాయవాది లక్ష్మణ శర్మ, బార్ అసోసియేషన్ఉపాధ్యక్షుడు శేఖర్, జగన్ గౌడ్, మల్లేష్, కృష్ణ, శ్రీనివాస్, శ్రీశైలం, శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఎ, చంద్రశేఖర్ మేజర్ న్యూస్,