ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో గెలుపు మాదే. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
గంగుల కుటుంబం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
కొంతమంది గుంట నక్కలతో వెళ్లి మాజీ ఎమ్మెల్యేగంగుల బ్రిజేంద్రారెడ్డి, మాజీ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఆఫీస్ వద్ద హడావిడి చేశారని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఎద్దేవా చేశారు. ఆమె శుక్రవారం విలేకరులతోమాట్లాడుతూ
ఈ రెండు సంవత్సరాలలో మేము దౌర్జన్యం చేయాలి అనుకుంటే మీరు ఇళ్లలో నుంచి బయటికి వచ్చేవారా, నోరెత్తి మాట్లాడేవారా అన్నారు.3 గంటల వరకే నామినేషన్ ప్రక్రియ ఉండగా వైసీపీ వాళ్లు 2:45 కు వచ్చి హడావిడి చేశారన్నారు. నిజంగా నామినేషన్ వేయాలి అనుకుంటే వైసిపి వాళ్ళు 11 గంటల నుంచే వచ్చేవాళ్ళు కదా అని ఆమె విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో నామినేషన్ వేస్తున్న ఒక ముస్లిం మహిళను ఇంట్లోకి తీసుకెళ్లి చెంప దెబ్బ కొట్టి నామినేషన్ విత్ డ్రా చేపించారు అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆరోపించారు.మేము అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎక్కడ వైసిపి వాళ్లను ఇబ్బంది పెట్ట లేదన్నారు. మేము ఎక్కడ దౌర్జన్యం చేయలేదని, నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హెచ్చరించారు.న్యాయంగా ధర్మంగా పోరాటం చేస్తూ రాజకీయం చేస్తున్నాం అని భూమా అఖిల ప్రియ అన్నారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోమీరు ఎన్ని చోట్ల పోటీ చేసినా గెలిచేది మేమే అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు.సొంత ఇంటికే కన్నం వేసిన గుంటనక్కలను మీరుపక్కన పెట్టుకొని రాజకీయం ఆమె ఆరోపించారు. వాళ్లు మీ ఇంటికి కన్నం వేసి ఉంటారు చూసుకోండి జాగ్రత్త అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హితవు పలికారు. మేము ఇళ్లల్లో కూర్చొని నామినేషన్లు వేసి గెలుస్తాం అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ధీమా వ్యక్తం చేశారు.