వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్
నర్సాపురం, మేజర్ న్యూస్:వైసిపి మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా కావలి రామ సీత శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గత పాలకవర్గంలో 23వ వార్డు నుండి కౌన్సిలర్ గా పని చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, వైసీపీ పార్టీ అభివృద్ధి చేయటంలో ఆమె అంకితభావంతో పనిచేయడంతో ఆ పార్టీ నుండి చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, కామన బుజ్జి తదితరులు పాల్గొన్నారు.