.సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు
ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. శ్రీ ఆర్యవైశ్య వాసవి కన్యకా పరమేశ్వరి కోదండ రామస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడంతోపాటు ప్రధాన వీధుల్లో కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవ కమిటీ ప్రతినిధులు డి.లక్ష్మణమూర్తి, సిహెచ్ సుధీర్ బాబు, పరిటాల వెంకట సత్యనారాయణ, పి.శరత్ బాబు, ఎస్ కిరణ్ కుమార్, కె.సురేష్ బాబు, రాజా వెంకటేష్, ఎం హరికృష్ణ,నున్న సంతోష్ కుమార్, ఆర్. సత్యనారాయణ, ఏ.వీ. రాము,సిహెచ్.తరుణ్, జి. వెంకటేశ్వర్లు, డి. శ్రీనివాసులు, శ్రీరాం శీను, టీ. చిన్న బాబు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిన్ని సుధీర్ బాబు, కార్యదర్శి సోమిశెట్టి కిరణ్ కుమార్, కోశాధికారి కొలిశెట్టి చంద్రమోహన్, ఆలయ చైర్మన్ దోర్నాదుల సురేష్ బాబు, కార్యదర్శి పొన్నూరు హాజరత్తయ్య, కోశాధికారి మద్దాలి సతీష్ కుమార్ ఉత్సవాలను పర్యవేక్షించారు. అమ్మవారికి సహస్ర నామార్చనతోటి కుంకుమ పూజ జరిగింది. ఉత్సవాల్లో ఆరవ రోజైన శుక్రవారం అమ్మవారికి శ్రీ సరస్వతి దేవి అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి
ఉభయకర్తలుగా సింగంశెట్టి సుందర్ రాజా, క్రిష్టం పవన్, దేవతి సుధాకర్ రావు, రమేష్ బాబు, గ్రందే వెంకటేశ్వర్లు, పెసల వెంకటేశ్వర్లు, ఎక్కల మహాలక్ష్మి, భోగనాదం విజయభాస్కర్, చిన్ని వెంకటరమణ, మోహన్ రావు, గ్రందే వెంకటేశ్వర్లు, రజని, పెటేటి మల్లికార్జున, అమరా ప్రసాద్, పెసల సురేష్ బాబు, చీమకుర్తి లక్ష్మి కుమారి, పోలేపల్లి మోహన్, కలిశెట్టి రాఘవేంద్ర రావు, రాచపూటి వెంకటేశ్వరకు, షరాబు శేషగిరి, సింగంశెట్టి చిన వెంకటేశ్వర్లు, కలిశెట్టి వెంకటరత్నం లు
వ్యవహారించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్తప్రసాదాలు స్వీకరించారు.