స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం
4 మున్సిపల్ కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు ,నగర పంచాయతీల్లో పోటీ..
సూర్య రాజకీయ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పోటీకి జనసేన పార్టీ సర్వం సన్నద్ధమైంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు అధికారికంగా ఖరారయ్యాయి. ఇందులో భాగంగా నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్లుగా, 21 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలలో చైర్మన్లుగా జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేయబోతున్న అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి దశనూ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జనసేన పార్టీ మేయర్ స్థానాల్లో పోటీ చేసే కార్పొరేషన్ల వివరాలు:
మొదటిది శ్రీకాకుళం, రెండవది కాకినాడ, మూడవది ఏలూరు, నాల్గవది విజయవాడ. జనసేన పార్టీ చైర్మన్ స్థానాల్లో పోటీ చేసే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వివరాలు:
ఒకటవది రాజాం, రెండవది పాలకొండ, మూడవది సాలూరు, నాల్గవది తుని, ఐదవది గొల్లప్రోలు, ఆరవది పిఠాపురం, ఏడవది సామర్లకోట, ఎనిమిదవది ముమ్మిడివరం, తొమ్మిదవది అమలాపురం, పదవది నిడదవోలు, పదకొండవది నరసాపురం, పన్నెండవది భీమవరం, పదమూడవది తాడేపల్లిగూడెం, పద్నాలుగవది తిరువూరు, పదిహేనవది పెడన, పదహారవది తెనాలి, పదిహేడవది చిలకలూరిపేట, పద్దెనిమిదవది దర్శి, పందొమ్మిదవది మడకశిర, ఇరవైయవది పుట్టపర్తి, ఇరవై ఒకటవది పుత్తూరు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది పోటీ చేసే స్థానాలు ఖరారు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు ప్రారంభించాయి.