భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష,
నెల్లూరు, అర్బన్/క్రైమ్ (మేజర్ న్యూస్):నెల్లూరు జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈరోజు అనగా 16.10.2026న నెల్లూరు టౌన్ శ్రీమతి దీక్ష, నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని రిటర్నింగ్ ఆఫీసర్స్ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
**రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్ ల పరిశీలన:**
నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుంకు చంగన్న మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కేంద్రాన్ని, సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వార్డు నంబర్ 62 సచివాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కేంద్రాన్ని ASP శ్రీమతి దీక్ష, IPS గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై తగిన సూచనలు చేశారు.
**పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి:**
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రిటర్నింగ్ ఆఫీసర్స్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ASP గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చిన్న బజార్ పోలీస్ స్టేషన్ CI, సంతపేట పోలీస్ స్టేషన్ అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.