BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి"

Select Suryaa Now
 స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి"

నెల్లూరు, మేజర్ న్యూస్ :శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పొదలకూరు మండల నాయకులతో సమావేశమై,స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై చర్చిచి, దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి 

- స్థానిక ఎన్నికలే 2029లో జగనన్న విజయానికి నాంది కావాలి 
- ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అవసరమైన అన్ని ఫారాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి
- ఎన్నికలకు సంబంధించిన ఫారాలు నింపడం, పత్రాల సమర్పణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదు
- ఎన్నికల నిబంధనలు, నామినేషన్ ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలు అవగాహన పెంచుకోవాలి
- అభ్యర్థులు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను ముందుగానే సమకూర్చుకోవాలి
- స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి
- గ్రామస్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి
- నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలి
- జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యంగా పనిచేయాలి
- పొదలకూరు మండలంలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ..

స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని కాకాణి సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు అవసరమైన అన్ని ఫారాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కాకాణి  సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఫారాల నింపడం, ధ్రువపత్రాల సమర్పణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని అన్నారు. ఎన్నికల నిబంధనలు, నామినేషన్ ప్రక్రియపై నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.

అభ్యర్థులకు అవసరమైన కుల, ఆదాయ, ఇతర ధ్రువీకరణ పత్రాలను సంబంధిత అధికారులు సకాలంలో అందజేయాలని కాకాణి డిమాండ్ చేశారు. కొంతమంది అధికారులు కావాలనే ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం చేస్తూ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, అలాంటి చర్యలకు తావివ్వకూడదని అన్నారు. నామినేషన్ల దాఖలుకు నిర్ణీత గడువు ఉన్నందున అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, అభ్యర్థులు అడిగిన అవసరమైన పత్రాలను ఎలాంటి అనవసర జాప్యం లేకుండా అందించాలని కోరారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాలని, ధ్రువీకరణ పత్రాల జారీలో నిర్లక్ష్యం వహించే అధికారులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కాకాణి పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలను 2029 సాధారణ ఎన్నికలకు పునాదిగా భావించి పార్టీ శ్రేణులు కష్టపడి  పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ, ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.

స్థానిక ఎన్నికల్లో సాధించే విజయాలు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలకు దోహదపడేలా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు కృషి చేయాలని పేర్కొన్నారు.

పార్టీ నాయకులు వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని, గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.

జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకాణి పిలుపునిచ్చారు.