ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :
మంగళగిరి లోని వారి ఇంటి నుంచి వెళ్లిపోయి గూడూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న బాలికను డీసీపీయూ, చైల్డ్‌లైన్ సిబ్బంది సమన్వయంతో సంరక్షించి, కౌన్సెలింగ్ అనంతరం తల్లికి అప్పగించారు.వివరాల్లోకి వెళితే.. 12-10-2026న మంగళగిరికి చెందిన బాలిక ఇంట్లో పనులు సక్రమంగా చేయలేదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయింది. మంగళగిరి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి గూడూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ విధుల్లో ఉన్న జీఆర్పీ/ఆర్పీఎఫ్ పోలీసులు హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించారు. దీంతో చైల్డ్‌లైన్ సిబ్బంది వెంటనే స్పందించి బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు.అనంతరం బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సి డబ్ల్యూ సి ) ముందు హాజరుపరచగా, కమిటీ ఆదేశాల మేరకు తగిన సంరక్షణ చర్యలు చేపట్టారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం (డి సి పి యూ ) సిబ్బంది, చైల్డ్‌లైన్ సిబ్బంది సమన్వయంతో బాలిక తల్లిదండ్రుల వివరాలను సేకరించి, ఆమె తల్లికి సమాచారం అందించారు.ఈ క్రమంలో శుక్రవారం నాడు బాలిక తల్లిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లల పట్ల ప్రేమాభిమానాలతో వ్యవహరించాలని, వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం బాలికను ఆమె తల్లికి అప్పగించారు.అలాగే జిల్లా బాలల సంరక్షణ అధికారి బి. సురేష్ ఆదేశాల మేరకు డీసీపీయూ, చైల్డ్‌లైన్ సిబ్బంది సమన్వయంతో ఈ చర్యలు చేపట్టారు. పిల్లల భద్రత, సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, వారు సమస్యల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోకుండా తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ సిబ్బంది పలు సిబ్బంది పాల్గొన్నారు