BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం*

Select Suryaa Now
శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం*

నెల్లూరు, అర్బన్/క్రైమ్ (మేజర్ న్యూస్):*
నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలో కొలువుదీరిన ప్రసిద్ధ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లతో సర్వాంగసుందరంగా అలంకరించడం విశేష ఆకర్షణగా నిలిచింది.ఉదయం ఆలయంలో మూలవిరాట్టుకు శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారిని సరస్వతీ అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.వేదమంత్రోచ్చారణలు, ‘జై వాసవి మాత’ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.భక్తులందరిపై అమ్మవారి అనుగ్రహం ఉండాలనే ఆకాంక్షతో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కోట గురుబ్రహ్మం తెలిపారు. ఈ సందర్భంగా చలువాది కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సింహపురి వీణత్రయం బృందం సమర్పించిన ‘వీణానాథ నీరాజనం’ ప్రదర్శనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి.ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు కొండ ప్రవీణ్ శంకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు శేగు షణ్ముగరావు, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కోశాధికారి జనార్దన్ రావు, ఉపాధ్యక్షుడు వేముల ప్రసాద్, సంయుక్త కార్యదర్శి మునగ వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు ఆంజనేయులు, వాయుగుండ్ల బ్రహ్మయ్యతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.