కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు
కైకలూరు, మేజర్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ స్థానిక కైకలూరు సీతారామ కళ్యాణ మండపం నందు స్థానిక సంస్థల ఎన్నకలకు మండల స్థాయి కూటమి నేతలతో ఏర్పాటుచేసిన ఎన్డీఏ కూటమి మండల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతు కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు తమ స్థానిక కూటమి అభ్యర్థులు విజయానికి కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. మూడు పార్టీల మండల స్థాయి నాయకులు సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక చేసి కూటమికి నూటికి నూరు శాతం విజయం అందించాలని సూచించారు. గత రెండేళ్లుగా మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నాము. పంచాయతీల అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థుల గెలుపు అత్యంత అవసరం అని ప్రజలకు వివరించారు. రాష్ట్ర స్థాయిలో మన అధినేతలు కూటమి సీట్ల సర్దుబాటును ఒక ఫార్ములా ప్రకారం విజయవంతంగా కొలిక్కి తెచ్చారని నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఉంటే వాటిని పక్కన పెట్టి పార్టీ విజయాన్ని మాత్రమే గుర్తుంచుకోవాలని పోటీ చేసేది ఏ పార్టీ అభ్యర్థి అయినా, మూడు పార్టీల కార్యకర్తలు మన సొంత అభ్యర్థిలా భావించి పని చేయాలని అన్నారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వానికి ఆకర్షితులై కైకలూరు దానగూడెం మరియు తామరకొల్లు గ్రామం నుంచి పలువురు వైసీపీని వీడి కూటమిలో జెరిన వారికి ఎమ్మెల్యే కామినేని కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, నియోజకవర్గ టిడిపి కన్వినర్ కొత్తా నాగేంద్ర కుమార్, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చనుమోలు చంద్రశేఖర్, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.