శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి.
నల్లగొండ జిల్లా. చింతపల్లి ప్రతినిధి.. చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ సాగర్ హైవే పైన ఉన్న శ్రీ వన మైసమ్మ తల్లి ఆలయం వద్ద ఈరోజు శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మూల నక్షత్రం రోజున శ్రీ సరస్వతి మాత అలంకరణలో వనమైసమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సిద్దగోని. కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలు నాయక్ సహకారంతో ,స్థానిక భక్తుల సహకారంతో, గ్రామ ప్రజల కృషి తో దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. పోలేపల్లి రాంనగర్ ప్రజలు భక్తులు తదితరులు ఉన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో వస్తున్నారని ఆలయ కమిటీ చైర్మన్ .కృష్ణ అన్నారు. అదేవిధంగా చింతపల్లి మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో దుర్గామాత సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ మండపాల వద్ద అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మాల్ వెంకటేశ్వర్ నగర్ లోని శ్రీ గాయత్రి పీఠంలో దుర్గామాతను సరస్వతి దేవిగా ప్రత్యేకంగా అలంకరించారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ గాయత్రి పీఠ0 వ్యవస్థాపకులు పురోహితులు శ్రీ సత్య సాయి బాబా శాస్త్రి, వారి కుటుంబ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. తీదేడు గ్రామంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. సర్పంచ్ ఉలుపాల. స్వప్న శేఖర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాల్ రామ లింగేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. దుర్గామాత సరస్వతి మాతగా ప్రజలకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ ఊరే. లక్ష్మణ్ దంపతులు హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు భక్తులు తదితరులు ఉన్నారు.. కురుమేడు,తక్కల పెళ్లి, చింతపల్లి సాయి సన్నిధి, చింతపల్లి గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయం, మరియు మండలంలోని వివిధ గ్రామాలలో దుర్గామాతను ప్రత్యేకంగా అలంకరించారు., వివిధ మండపాల వద్ద సరస్వతి మాత కు ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు చిన్నారులకు పెన్నులు పెన్సిల్లు పుస్తకాలు నిర్వాహకులు భక్తులు పంపిణీ చేశారు.