BREAKING
స్థానిక ఎన్నికల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ అంకమ్మ .సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..!

భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ

Select Suryaa Now
భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ
నవాబుపేట, మేజర్ న్యూస్,: భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టేందుకు చేపట్టిన బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, సోక్ పిట్స్‌ను డీపీఓ జయసుధ శుక్రవారం  నవాబుపేట మండల కేంద్రంలో సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, సోక్ పిట్స్ పనితీరును ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలమట్టాలను పెంచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సోక్ పిట్స్‌ ద్వారా మురుగునీటి నిర్వహణ మెరుగుపడటంతో పాటు పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవచ్చని సూచించారు.గ్రామాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, చేపట్టిన నిర్మాణాలు సమర్థవంతంగా పనిచేసేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. నీటి వనరులను పరిరక్షించడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నవాబుపేట సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీడీవో అనురాధ, ఎంపీఓ విజయకుమార్, పంచాయతీ కార్యదర్శి నవనీత, ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.