BREAKING
డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వ ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే కాలే యాదయ్య ద్రాక్షారామం వారసత్వంపై బీటెక్ విద్యార్థి పరిశోధన.

వక్కపువ్వులతో మూలవిరాట్ల అలంకరణ..

Select Suryaa Now
వక్కపువ్వులతో మూలవిరాట్ల అలంకరణ..

( అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి)

అనంతపురం అశోక్ నగర్‌లోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని మూలవిరాట్ విగ్రహాలను వక్కపువ్వులతో సుందరంగా అలంకరించారు. ఉత్సవ విగ్రహాలకు ఇంద్రాణి దేవి అలంకరణ చేసి గరుడసేవ నిర్వహించారు. ప్రత్యేక అలంకరణల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వడంతో భక్తులు పరవశించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబటి ఫణి రాజు, కార్యనిర్వాహక అధ్యక్షుడు తిరువీధుల జగదీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి భూపాలం కిషోర్, కార్యదర్శులు జయం సుబ్రహ్మణ్య ప్రకాష్, బయనగారి బద్రి ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయంలో నెలకొన్న ఆధ్యాత్మిక, భక్తిభావ వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.