నవాబుపేట, మేజర్ న్యూస్: పేద కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శుక్రవారం నవాబుపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అర్హులైన 23 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.23,00,368 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడబిడ్డల వివాహం తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రంగారెడ్డి, సర్పంచులు సంతోష్ రెడ్డి, శ్రీధర్, జగన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుగారి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ చారి, నరసింహారెడ్డి, మధు, జూనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.