తోపుచర్ల కనకదుర్గ ఆలయంలో ప్రత్యేకపూజలు *సరస్వతీదేవి అవతారంలో దర్శనం
మాడ్గులపల్లి, మేజర్ న్యూస్:
భక్తి పారవశ్యం...ఆధ్యాత్మిక శోభతో మాడ్గులపల్లి మండలం తోపుచర్ల గ్రామంలోని కనకదుర్గ ఆలయం పులకరించింది.
మండలంలోని తోపుచర్ల గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవాలయంలో శుక్రవారం దుర్గాదేవిని సరస్వతీదేవి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలుఅభిషేకాలు ఘనంగా నిర్వహించారు.
దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆలయ పూజారి బారువాది వేణుగోపాల శర్మ ఆధ్వర్యం లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, కుంకుమార్చన, అలంకరణ పూజలు నిర్వహించారు. విద్యకు, జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారినిదర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్య లోఆలయానికితరలివచ్చారు.ప్రత్యేకపూజలఅనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భం గా భక్తులు అమ్మవారి కృపతో సకల విద్యలు, విజ్ఞానం, సుఖసంతోషాలు కలగాలని వేడుకున్నారు. చదువులతల్లిఅలంకరణలో అమ్మవారినిదర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమని భక్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నన్నెబోయిన పార్వతమ్మ లింగయ్య, కట్టా సునీత శ్రీనివాస్ రెడ్డి, వంటెద్దు సైదిరెడ్డి, కేసాని జానకమ్మ, కేసాని శ్వేత చంటి, పంపాటి శోభ శంకర్, మాడ్గులమంగమ్మ చుక్కయ్య, మాజీ ఎంపీటీసీ కత్తి కనకరెడ్డి, బొమ్మపాలెం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.