సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన గుత్తి రోడ్డు చౌడేశ్వరి దేవి అమ్మవారు..
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి: అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారిని శ్రీ సరస్వతి దేవి అవతారంలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్య, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా కొలిచే సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.