BREAKING
వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వ ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే కాలే యాదయ్య ద్రాక్షారామం వారసత్వంపై బీటెక్ విద్యార్థి పరిశోధన. చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 6 ఆజ్ఞాచక్రంలో అమ్మవారి ఆజ్ఞ - కాత్యాయనీ దర్శనం (అంతర్ దృష్టికి, అంతర్గత జ్ఞానానికి ప్రతీక) కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి సమష్టిగా కృషి చేయాలి --స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు పోటీకి సిద్ధం కావాలి --మాజీ మంత్రి, పిసిసి జిల్లా ఇన్చార్జ్ ఎన్. రఘువీరారెడ్డి మీనంపల్లి కలాన్‌లో గ్రామపంచాయతీ సామగ్రి చోరీ

ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే

Select Suryaa Now
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే

ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే 
-కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- సింగరేణి కాలరీస్ కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ప్రకాశం స్టేడియంలో సింగరేణి బతుకమ్మ మరియు ఫ్యామిలీ డే సంబరాలను వైభవంగా నిర్వహించారు.
జీఎం (పర్సనల్) వెల్ఫేర్, సీఎస్ఆర్ & సెక్యూరిటీ కే. అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  మాలతి సూర్యనారాయణ, ఎం. పద్మ తిరుమల రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు అపురూపంగా జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ అని, మన సంస్కృతికి ఇది దర్పణంగా నిలుస్తుందని అన్నారు. తొమ్మిది రోజుల పాటు సాగే వేడుకల్లో ఈ రోజు వేపకాయల బతుకమ్మగా పిలుస్తారని, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుందని తెలిపారు. ప్రకృతిలో లభించే పూలను పూజించే ఏకైక పండుగ ఇదేనని, సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.అనంతరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళలు తీసుకొచ్చిన బతుకమ్మలలో ఉత్తమమైన వాటిని న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 40 మందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అలాగే 14 సేవా సెంటర్లలో ఉత్తమ బతుకమ్మలకు కూడా బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాము, ఐఎన్టీయూసీ నాయకులు భాస్కర్, సీఎంఓఏఐ జాయింట్ సెక్రటరీ కే. కమలాకర్, జి. నాగ బిందు, బి. జయా, కే. సుజాత, డీజీఎంలు బి. శివ కేశవ రావు, ముకుంద సత్యనారాయణ, సేవా సెక్రటరీ మాధవీ స్వర్ణలత, సేవా కోఆర్డినేటర్లు, అధికారులు, ఉద్యోగులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.