BREAKING
శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. రీ-సర్వేతో రైతులకు భరోసా:బషీరాబాద్ తహసీల్దార్ షాహిదా బేగం

Select Suryaa Now
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. రీ-సర్వేతో రైతులకు భరోసా:బషీరాబాద్ తహసీల్దార్ షాహిదా బేగం
బషీరాబాద్, మేజర్ న్యూస్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమంతో దీర్ఘకాలిక భూ వివాదాలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని బషీరాబాద్ తహసీల్దార్ షాహిదా బేగం అన్నారు. భూముల హద్దులను కచ్చితంగా గుర్తించి, రైతులకు భూ భద్రత కల్పించడమే రీ-సర్వే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.బషీరాబాద్ మండలం కుప్పన్‌కోడ్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ రామ్‌శెట్టి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన రీ-సర్వే గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రీ-సర్వే చేపడుతోందని తెలిపారు. డ్రోన్లు, రోవర్ పరికరాల సహాయంతో భూములను సర్వే చేసి, ప్రతి ఎకరానికి సంబంధించిన హద్దులను కచ్చితంగా నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.రీ-సర్వే ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని తహసీల్దార్ సూచించారు. సర్వే సమయంలో రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో పొలాల వద్ద అందుబాటులో ఉండాలని కోరారు. తమ భూముల హద్దులను స్పష్టంగా చూపించి, సర్వేకు అవసరమైన వివరాలను అధికారులకు అందించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జున రెడ్డి, సర్వేయర్, జీపీఏలు, ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.