గోవిందుడి రూపంలో వాసవీ దేవి
కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అమ్మవారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శంఖు చక్రాలు, పట్టు వస్త్రాలు, విశేష పుష్పాలంకరణలతో ముస్తాబైన అమ్మవారి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచే వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.