BREAKING
దీర్ఘకాలిక యుద్ధమే మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు దీర్ఘకాలిక యుద్ధం, సరఫరా వ్యవస్థల విచ్ఛిన్నమే మధ్యప్రాచ్య ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పు ఇరాన్‌పై దాడికి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ వినియోగంపై అమెరికా ఆర్మీ కసరత్తు డౌన్లోడ్ బ్రస్సెల్స్‌లో ప్రారంభమైన ఈయూ అధినేతల సమిట్ నేడు సచివాలయంలో మంత్రులతో కీలక భేటీ మాగుంటను కలిసిన టిడిపి నేతలు. పోలీస్ కమిషనరేట్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం ఓటర్ల ప్రత్యేక తనిఖీ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో నేడు విచారణ కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు కోటి జన్మల పుణ్యం - కొల్హాపూర్ మహాలక్ష్మి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 7వది) చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 5 విశుద్ధిలో వాత్సల్యం - స్కందమాత దర్శనం (ధైర్యానికి, సంకల్పానికి ప్రతీక - స్కందుని తల్లి) కన్సెంట్ ఆర్డర్‌పై పెద్ద ఎత్తున పని పూర్తి చేశామన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా

కోటి జన్మల పుణ్యం - కొల్హాపూర్ మహాలక్ష్మి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 7వది)

Select Suryaa Now
కోటి జన్మల పుణ్యం - కొల్హాపూర్ మహాలక్ష్మి వైభవం (అష్టాదశ శక్తిపీఠాలలో 7వది)

కోటి జన్మల పుణ్యం - కొల్హాపూర్ మహాలక్ష్మి వైభవం

(అష్టాదశ శక్తిపీఠాలలో 7వది) 

 

కొల్హాపూర్ మహారాష్ట్రలోని మహాలక్ష్మీ దేవాలయానికి ప్రసిద్ధి. ఈ శక్తి పీఠం హిందువుల ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాలలో ఎంతో విశిష్టత పొందిన శక్తిపీఠం శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు కోలహాసురుడును సంహరించి ఇక్కడ వెలసిందని అందుకే కొల్హాపూర్ అనే పేరు వచ్చింది. సకల సంపదలకు నిలయం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు. ఆమె కరుణ తమపై ప్రసరించాలని కోట్లాది భక్తులు నిత్యపూజలు చేస్తుంటారు. తనని నిత్యం ఆరాధించే  భక్తుల కోసం భూమిపై అమ్మగా ఆమె అంబా బాయి గా వెలసిన క్షేత్రమే మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని శ్రీమహాలక్ష్మీ ఆలయం. నిత్యం వేలాదిమంది భక్తులు ఆమెనుదర్శించుకొనిపునీతులవుతుంటారు. ఏడవ శక్తిపీఠంగా కూడా కొల్హాపూర్‌కు ఆధ్యాత్మిక ప్రాశస్త్యముంది.

:స్థలపురాణం: ఈ ఆలయం ప్రాముఖ్యత:

ఇక్కడ సతీదేవి నయనాలు పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఆలయం అంతా కళా సృష్టి అని చెప్పవచ్చు. ప్రతినిత్యం  ఉదయం  అభిషేకం అలంకారాదులు నిర్వహిస్తారు. మహాలక్ష్మి దేవి మూల విరాట్ పై  సూర్య కిరణాలు నేరుగా ప్రసరించడం ఇక్కడ విశేషం. దీనినే కిరణోత్సవం అంటారు.

మహాలక్ష్మిని ప్రేమగా అంబా బాయి అనికూడా పిలుస్తారు. ప్రతి ఏడాది శరన్నవరాత్రి ఉత్సహావాలు వైభవంగా జరుపుతుంటారు. చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని అంబబాయి అని కరివీర్ మహాలక్ష్మి అనే పేరులతో పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణం అంతా అలనాటి రాజ సంస్కృతుల తో కనిపిస్తాయి.

కొల్హాపురంలో వెలసిన అమ్మవారి ప్రాశస్త్యం అందరికి తెలియడంతో క్షేత్రం అందరికి దర్శనకేంద్రంగా మారింది.

కొల్హాపూర్ అనే పేరును కొల్హాపూర్ అనే రాక్షసుడు మహాలక్ష్మి చేత జయించబడటంతో అతని పేరు పురాణాలకు అతీతంగా విస్తరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాన్ని కర్వీర్‌గా వ్యవహస్తారు. ఆ మహాదంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రళయంలోనూ చెక్కుచెదరదు. అందుకనే ఈ క్షేత్రాన్ని అవిముక్తేశ్వర క్షేత్రమని పేర్కొంటారు. లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించింది. అందుకనే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు, రుషులు పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.

అరుదైన శిలపై అమ్మవారి రూపం:

గర్భ గుడి ముందు వందడుగుల పొడవుగల మండపం ఉంటుంది. గర్భగుడిలో ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి అమ్మవారు విగ్రహం కుర్చొని ఉన్న స్థితిలో ఉంటుంది. శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు.

ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది. దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది

నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న రూపం మనల్ని ఆకట్టుకుంటుంది. ఫలం, గద, కవచం, పాత్రను నాలుగుచేతుల్లో కలిగివున్న దివ్యమంగళరూపం, కిరీటంలో ఐదు తలల పాము ఉంటుంది. ఇంకా. స్కంద పురాణంలోని లక్ష్మీ సహస్రనామంలో, లక్ష్మీ దేవిని "ఓం కరవీర నివాసినియే నమహా" అని స్తుతిస్తారు, అంటే "కరవీరలో నివసించే దేవతకు మహిమ" అని మరియు "ఓం శేష వాసుకి సంసేవ్యా నమహా" అని అంటే" ఆది శేషుడు మరియు వాసుకి సేవ చేసే దేవతకు మహిమ అని. అవి లక్ష్మీ సహస్రనామంలో వస్తాయి..

:పూర్వ కధ:

అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించు కోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్య ఫలాలనిస్తుందని చెప్పాడట. శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది.  కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది.

నారాయణిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సిరిసంపదలకు లోటువుండదు. ఆమె కటాక్షం కోసం యావత్‌ మానవాళి ప్రార్థిస్తుంది. స్వయంగా ఆమె తపస్సు చేసి వెలసిన ప్రాంతమే కొల్హాపురం. అందుకనే ఆ నగరంలో పేదరికం వుండదని పెద్దలు చెప్తారు.

*********-----************

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com

www.padmamukhi.com