BREAKING
21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు

ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల వంటావార్పు -- ఉద్యోగ భద్రత కల్పించాలని 4వ రోజు నిరసన

Select Suryaa Now
ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల వంటావార్పు  -- ఉద్యోగ భద్రత కల్పించాలని 4వ రోజు నిరసన

*నారాయణపేట, సూర్యన్యూస్:*. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్.హెచ్.ఏం) ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. శుక్రవారం స్థానిక శ్రీవివేకానంద మున్సిపల్ పార్క్ దగ్గర వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎన్.హెచ్.ఏం ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల జీవితాల్లో మాత్రం ఆశించిన మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులు నేటికి కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో అభద్రత మధ్య పనిచేయాల్సి వస్తోందన్నారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు తప్పని సరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తమ కుటుంబాలను పోషించేందుకు అందుకు తగిన వేతనాలు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు బిక్షపతి, అధ్యక్షులు ప్రసాద్, కోశాధికారి రాఘవేందర్, ఎన్.హెచ్.ఎం యూనియన్ సభ్యులు డాక్టర్ నరసింహరావు సగరి, వినోద్, శ్రీలత, అనురాధ, తిరుపతి, కిరీటి, విరోజ, చందన, శ్వేతశ్రీ, పుష్ప, సరస్వతి, స్నేహలత, మమత పాల్గొన్నారు.

*మద్దతుకు పలువురు సంగీభవం :*
ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల నిరసనకు పలువురు ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. ముఖ్యంగా టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు ఏం.నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులు ఉదయభాను, విజయ కుమార్, టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప,  యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు బాలాజీ, భీమయ్య, పిఆర్టీయూ మండల అధ్యక్షులు మొల్గాన్ జనార్ధన్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోవిందరాజు, బలరాం, డిఎంఎచ్ఓ కార్యాలయ అధికారులు డాక్టర్ సాయిరాం, డాక్టర్ సత్య ప్రకాష్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి ఉద్యోగ సంఘం నాయకులు డాక్టర్ బాలాజీ, సత్యనారాయణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో ఉండి ఎందరో ప్రాణాలు కాపాడుతున్న ఎన్.హెచ్.ఏం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.