BREAKING
డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వ ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే కాలే యాదయ్య ద్రాక్షారామం వారసత్వంపై బీటెక్ విద్యార్థి పరిశోధన.

భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు

Select Suryaa Now
భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి  -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు

*నారాయణపేట, సూర్యన్యూస్:*  నారాయణపేట మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నారాయణపేట మండలం భైరంకొండతో పాటు సింగారం శ్రీగిరి పీఠంపై కొలువైన భవానీమాత అమ్మవారు ఆరో రోజు శుక్రవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో చదువుల తల్లి సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కోటకొండ వాసవీ కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవీ మాత రూ. 333333 రూపాయలతో మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా  అమ్మవారికి  అభిషేకం, పుష్పాలంకరణ, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతులు ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్దలతో అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అలాగే భవానీమాత దీక్షలో ఉన్న భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.