BREAKING
ద్రాక్షారామం వారసత్వంపై బీటెక్ విద్యార్థి పరిశోధన. చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 6 ఆజ్ఞాచక్రంలో అమ్మవారి ఆజ్ఞ - కాత్యాయనీ దర్శనం (అంతర్ దృష్టికి, అంతర్గత జ్ఞానానికి ప్రతీక) కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి సమష్టిగా కృషి చేయాలి --స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు పోటీకి సిద్ధం కావాలి --మాజీ మంత్రి, పిసిసి జిల్లా ఇన్చార్జ్ ఎన్. రఘువీరారెడ్డి మీనంపల్లి కలాన్‌లో గ్రామపంచాయతీ సామగ్రి చోరీ బొంపల్లి బిడ్డకు పోలీస్‌ శిక్షణలో గుర్తింపు క్రీడలతోనే విద్యార్థుల సమగ్ర వికాసం* అమ్మవారి పీఠాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతమనేని మొదటి రోజు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి.. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్.. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. రీ-సర్వేతో రైతులకు భరోసా:బషీరాబాద్ తహసీల్దార్ షాహిదా బేగం ఉక్రెయిన్ సరిహద్దులో నాన్-నెగోషియేబుల్ భద్రతా మండలి నిర్మాణం *బతుకమ్మ మెట్లను పరిశీలించిన ఎమ్మెల్యే* మైల్వార్‌లో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని వినతి *నాట్య మయూరి సినీత విజయకి ఘన సత్కారం* జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు ఆసుపత్రి నుంచి పుతిన్‌తో పోప్ సిఫ్రియన్ ఫోన్ కాల్

పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి

Select Suryaa Now
పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకడియం మండల పరిసర ప్రాంతాల్లో నర్సరీ రైతుల మోటార్ వైర్ల దొంగతనాలను అరికట్టాలని కోరుతూ సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొర్సు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు కడియం పోలీస్ స్టేషన్ సీఐ అల్లు వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ

మోటార్ వైర్ల చోరీలతో రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, నర్సరీలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లామన్నారు . దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో పోలీసు నిఘా పెంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు వారిని కోరినట్లు ఆయన తెలిపారు .

నర్సరీ రైతుల సమస్యల పరిష్కారానికి, వారి రక్షణకు అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఉండమట్ల అర్జున్, కన్వీనర్ సానా రాజు, పీఆర్వో కామిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.