జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
--జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఖమ్మం,(సూర్య బ్యూరో): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఖమ్మం ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ బ్యాంకు పర్సన్ ఇన్-ఛార్జ్ కమిటీ సభ్యులు పి. శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని, తెలంగాణ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈవో వెంకటాదిత్య డీజీఎం లు ఉదయశ్రీ, వేణుగోపాల్ సర్వేశ్వరరావు ఇతర అధికారులు బ్యాంకు సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొని, ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలను నిర్వహించి ఉద్యోగుల ఐక్యతను చాటుకున్నారు.