అమ్మవారి పీఠాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతమనేని
ద్వారకాతిరుమల, మేజర్ న్యూస్: మండలంలోని తిమ్మాపురం గ్రామంలో తోట గంగాధర్ నిర్వహిస్తున్న అమ్మవారి పీఠాన్ని శుక్రవారం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పోలిన శ్రీనివాసరావు, ఏపూరి దాలయ్య, ఇమ్మడి రత్నాజీ, మట్టపర్తి రూపేష్ కుమార్, గంటా శ్రీనివాసరావు, ఏపూరి కిషోర్, అందుగుల రాములు, బోట్ల సాయి, ఆచంట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.